నాగపూర్ లో హజరత్ బాబా తాజుద్దీన్ ఔలియా వారికి చాదర్ సమర్పించిన ముస్లిం తాటి చెట్ల పాలాని( బడేగావ్) కి చెందిన యువకులు

జీవీఎంసీ 44వ వార్డు ముస్లిం తాటిచెట్ల పాలెం పెద్దూరుకు చెందిన ముస్లిం యువకులు నాగ్ పూర్ లో హజరత్ బాబా తాజుద్దీన్ ఔలియా వారి 104వ చందనోత్సవం ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ ఉర్సు ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతాయి . ఈ ఉర్సు ఉత్సవాలకు భారతదేశ నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ ఉర్సు ఉత్సవాలలో నాగపూర్ ప్రాంతం జన సందడితో కిటకిటలాడుతుంది ఈ ఉర్సు ఉత్సవాలలో ముస్లిం తాటిచెట్ల పాలానికి చెందిన ముస్లిం యువకులు పాల్గొని బాబా వారికి చాదర్స మర్పించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా వారి ఉర్సు ఉత్సవాలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ ఉర్సు ఉత్సవాలు వర్ణనాతీతమని ప్రతి సంవత్సరం బాబా వారి చందనోత్సవాల లో పాల్గొనాలి అనిపించే అంత వైభవంగా జరుగుతాయని బాబా వారి వద్దకు వచ్చి తమ కష్టాలు బాధలు చెప్పుకుంటే అవి పరిష్కారం అవుతాయని అన్నారు.




