కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపాలి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను బర్తరఫ్ చేయాలి – కె కె రాజు

- డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి
- యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారిని మానసికంగా వేదిస్తుంది
- రానున్న రోజుల్లో యువత కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు
- రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగిన వారి తరుపున వై.యస్.ఆర్.సి.పి నిరంతరం పోరాటం చేస్తుంది
- వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె రాజు
మే 29 శుక్రవారం ట్రూ న్యూస్ విశాఖ : కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను బర్తరఫ్ చేయాలని.. డిమాండ్ చేస్తూ.. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో.LIC బిల్డింగ్, డాబాగార్డెన్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు విగ్రహం వద్ద శాంతియుతంగా భారీ నిరసన కార్యక్రమం జరిగింది.ముందుగా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు పార్టీ శ్రేణులందరితో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు 40 లక్షల మంది నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలను పూర్తిగా మరిచిపోయి నిరుద్యోగ యువతను మోసం చేశారు. ఇప్పటికే డీఎస్సీ పరీక్షల్లో ప్రతిభతో, మెరిట్‌తో అర్హత సాధించిన నిరుద్యోగ యువతీ యువకులకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఉద్యోగాలు కల్పించకపోగా, యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారిని మానసికంగా వేధిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఎవరికి అన్యాయం జరిగిన వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ స్కాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. ఎన్నికల సమయంలో “సూపర్ సిక్స్”, “సూపర్ సెవెన్” అంటూ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈరోజు వాటి అమలుపై సమాధానం చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో గానీ,ప్రైవేట్ రంగంలో గానీ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలి అని కె.కె రాజు డిమాండ్ చేశారు. యువత ఆశలను వమ్ము చేసిన ఈ ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో యువతే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగడిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలి. ఈకార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ ,తిప్పల దేవన్ రెడ్డి గారు,మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి గారు,కుంభ రవిబాబు గారు,మాజీ మంత్రి వర్యులు పసుపులేటి బాలరాజు గారు,మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ్, నియోజకవర్గ పరిశీలకులు,రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గం,వార్డు నాయకులు,విద్యార్థి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




