విశాఖపట్నం

పదవ తరగతి పరీక్షలలో ప్రతిభ చూపిన జర్నలిస్టుల పిల్లలకు గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా విద్యా ప్రోత్సాహకాలు

  • జర్నలిస్టుల పిల్లలకు విద్యా ప్రోత్సాహకాలు
  • పదిలో వారి ప్రతిభ ప్రశంసనీయం
  • ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం
  • విద్యతోనే అపార ఉపాధి అవకాశాలు
  • జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల

అక్కయ్యపాలెం జంక్షన్ మే 2 : సమాజంలో…ఉన్నత విద్యతో అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అనేక మంది యువత కోరుకున్న రంగాల్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి.. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు.. డాక్ యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు.శనివారం అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద తన కార్యాలయంలో పదో తరగతిలో ప్రతిభ చూపిన పలువురు..జర్నలిస్టుల పిల్లలకు గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా విద్యా ప్రోత్సహకాలు అందించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎంతోమంది పిల్లలు అసాధారణ ప్రతిభ కనబరిచారన్నారు.. పదో తరగతి మార్కులు ప్రామాణికంగా తీసుకుని భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు.. ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని తద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని.. విదేశాల్లో సైతం భారతీయ విద్యార్థులు నూతన పరిశోధనలకు కేంద్ర బిందువుగా మారారన్నారు.. గురువులు తల్లిదండ్రులు మార్గదర్శకత్వంలో ముందుకు సాగడంతో పాటు విద్య ద్వారా అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలన్నారు.. మార్కులతో సంబంధం లేకుండా నచ్చిన కోర్సుల్లో చేరి మంచి విద్యాభ్యాసం సాగిస్తే ఇక వారు కోరుకున్నట్లే ఉపాధి పొందవచ్చు నన్నారు .. అప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు బాసటగా నిలుస్తారన్నారు ..ప్రస్తుతం ఎంతోమంది జర్నలిస్టుల పిల్లలు విదేశాల్లో సైతం అద్భుతంగా రాణిస్తున్నారని అందువల్లే ఏటా విద్యాప్రోత్సవాలతో పలువురిని సత్కరించడం జరుగుతుందన్నారు.. అద్భుత ఫలితాలు సాధిస్తున్న పిల్లల ప్రతిభను ప్రోత్సహించడం వల్ల వారిలో మరింత నూతన ఉత్సాహం వెళ్లి విరుస్తుందన్నారు. గత ఏడాది సుమారు 132 మందికి విద్యాప్రోత్సవాలు అందించామని అలాగే ఆ తర్వాత దశలవారీగా ఎప్పటికప్పుడు విద్యకు సంబంధించి తన పరిధి మేరకు పలువురు జర్నలిస్టుల పిల్లలకు ఆర్థికంగా సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.. ప్రస్తుతం 9 మంది పిల్లలకు ఈ ప్రోత్సాహకాలు అందించడం జరిగిందని జూన్ లో వంద మందికి పైగా పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తామన్నారు. తొలుత ప్రతిభచూపిన పలువురు జర్నలిస్టుల పిల్లలను గంట్ల శ్రీనుబాబు సత్కరించి ..మిఠాయిలు తినిపించి విద్యా ప్రోత్సాహకాలు అందించారు.. పదో తరగతిలో అత్యున్నత మార్కులు సాధించి విద్యా ప్రోత్సాహకాలు స్వీకరించిన వారిలో సుప్రియ.. యోగిత బిందు .. జి..గౌతమి, పిల్లా అక్షయ,రేస్మ

చంద్రికలతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!