విశాఖలో కదం తొక్కిన జర్నలిస్టులు

- చిత్తూరు జిల్లాలో జర్నలిస్టుహత్య ఆందోళనకరం
- దాడులను నియంత్రించేందుకు కమిటీలు ఏర్పాటు చేయండి
- వర్కింగ్ జర్నలిస్టుల శాంతియుత ప్రదర్శన
- జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ళ విద్యాధరికి వినతి పత్రం
విశాఖపట్నం మే 2 : చిత్తూరు జిల్లా లో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య తీవ్ర ఆందోళన కలిగించే అంశం అని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే.. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు పేర్కొన్నారు.. శనివారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్ కాస్ట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల సభ్యులు సంయుక్తంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించారు.. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జర్నలిస్టులపై హత్య రాజకీయాలను మానుకోవాలని డిమాండ్ చేశారు.. పాత్రికేయులు ..మీడియా ప్రచురించే వార్తలపై అభ్యంతరాలు ఉంటే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని.. యాజమాన్యాలకు ఫిర్యాదు చేయవచ్చునని అలా కాకుండా హత్యలకు తెగబడటం దుర్మార్గమన్నారు.. ఒక జర్నలిస్టును అంత అమానవీయంగా కిరాతకులు హత్య చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారన్నారు.. ఇటీవల సాలూరులో ఇద్దరు మీడియా ప్రతినిధులపై దాడులు కూడా సరికాదన్నారు.. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని కోరారు.. ఈ కమిటీలు ఏర్పాటు వల్ల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందన్నారు.. సమాజాభివృద్ధి కోసం పాటుపడుతున్న జర్నలిస్టులపై హత్యలు.. దాడులు సరికాదన్నారు. కూటమి. ప్రభుత్వం హత్యలు .. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వీరు డిమాండ్ చేశారు.. అలాగే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి మరింతగా కృషి చేయాలి అన్నారు.. కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ సొంత ఇంటి కల సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదేనన్నారు. అలాగే ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరణ.. జర్నలిస్టులకు పెన్షన్లు అందించే కార్యక్రమాలు కూడా చేపడితే చాలావరకు వారి కుటుంబాలకు భరోసా కలుగుతుంది అన్నారు..
ప్రభుత్వానికి నివేదిస్తా జెసి విద్యాధరి
శాంతియుత ప్రదర్శన అనంతరం జర్నలిస్టులు జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ళ విద్యా దరికి రెండు వినతి పత్రాలు అందజేశారు.. హత్యలు.. దాడులు చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని తక్షణమే అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని వినతి పత్రంలో కోరడం జరిగింది.. అయితే జేసీ విద్యాధరి జర్నలిస్టుల వినతిపత్రాలపై సానుకూలంగా స్పందించినట్లు గంట్ల శ్రీనుబాబు చెప్పారు.. ప్రత్యేక ఫైల్ రూపొందించి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపించినట్లు జెసి చెప్పడం జరిగిందన్నారు.. అలాగే జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు అందులో పొందుపరిచామన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు.. ఉపాధ్యక్షులు బి శివప్రసాద్.. కృష్ణమూర్తి నాయుడుకిషోర్ .. కర్రా సీతా రామ్.. బ్రాడ్ కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు .కింతాడ మదన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ విశాఖ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ కోశాధికారి కె వి శర్మ.. బొబ్బర ప్రసాద్.. రాజశేఖర్..సీనియర్ పాత్రికేయులు ఆర్ ఎరుకు నాయుడు తో పాటు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు




