విశాఖపట్నం
మే నెలలో అరుదుగా పూచే పుష్పం

ఈ చిత్రంలో కనిపిస్తున్న పుష్పం కేవలం మే నెలలో మాత్రమే పూస్తుంది. ఈ పుష్పాన్ని మే పుష్పం అని పిలుస్తారు.పుట్ బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ (Scadoxus Multiflorus) చూడ్డానికి ఎర్రని బంతిలా, ఆకట్టుకొనేలా ఉంటుంది. దినినే స్థానికంగా భారతదేశంలో మే పుష్పం అంటారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది కనుకనే దీనిని మే పువ్వు అంటారు. ఇది లిల్లీ జాతికి చెందిన దుంప రకం మొక్క. మే నెల ప్రధాన జన్మ పుష్పం: లిల్లీ ఆఫ్ ది వ్యాలీ (కాన్వల్లారియా మజాలిస్). లిల్లీ ఆఫ్ ది వ్యాలీ వివిధ సంస్కృతులలో ఒక ప్రసిద్ధమైన మరియు అర్థవంతమైన పుష్పం జీవీఎంసీ 44 వ వార్డు ముస్లిం తాటిచెట్ల పాలెంలో ఆరిఫ్ తన నివాసంలో మేడ పైన ఈ పువ్వు పూయడంతో ట్రూ న్యూస్ తో ఈ విషయాన్ని పంచుకున్నారు.




