రాజకీయాలువిశాఖపట్నం

ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో దళిత రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావుకు అవమానం ఆవేదన వ్యక్తం చేసిన గొల్ల బాబురావు

విశాఖపట్నం /ఏప్రిల్ 28( ట్రూ న్యూస్ ) :ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావుకు అవమానం జరిగిందని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం విశాఖ వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలను రాజకీయ ఈవెంట్గా మలిచారని తాను దళిత రాజ్యసభ సభ్యుడిగా తనపై వివక్షత చూపించారని పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తిగత అవమానం మాత్రమే కాకుండా దళిత సమాజంపై జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. దళితుల పట్ల ప్రభుత్వానికి గౌరవం లేకపోవడం బాధాకరమని జరిగిన ఘటనపై ప్రభుత్వం సంబంధిత అధికారులు క్షమాపణలు చెప్పాలని తనను ఎందుకు అవమానించారు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏయూ ప్రధాన ఏటు ముందు ధర్నా చేస్తానని శతాబ్ది సభలో అధికారులు ప్రోటోకాల్ ను పాటించకుండా దారుణంగా వ్యవహరించాలని విశ్వవిద్యాలయానికి పూర్వీకులు చేసిన సేవలను కూడా ప్రస్తావించలేదని తెలిపారు. ఈ ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు దీనిపై వెంటనే స్పందించి ఏయూ ఫై నిజమైన అభిమానం ఉంటే ప్రకటించిన నిధులకు జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వైసిపి జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రతి దశలో రాజకీయ జోష్యం పెరుగుతుండడం అత్యంత ఆందోళనకరమన్నారు విద్యాసంస్థలు రాజకీయాలకు అతీతంగా విద్యా ప్రమాణాలను కాపాడే కేంద్రాలుగా ఉండాలి కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ భావనకు విరుద్ధంగా కనిపిస్తున్నాయని అన్నారు ప్రభుత్వం చేతకానితనంతో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడం దురదృష్టకరమని అన్నారు కలిగించే వివరించడం అసహనీయమైన విషయం అన్నారు. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు అవమానించడం క్షమించరాని చర్య అని ప్రజాప్రజనులకు గౌరవం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందని వైసీపీలో ఉంటే రాజ్యసభ సభ్యులకు విలువ ఉండదా అనే ప్రశ్న తెలుస్తుంది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేశారని అలాంటి విశ్వవిద్యాలయంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమన్నారు  విశ్వవిద్యాలయాలు పరిపాలన పాదరసికంగా నిప్పక్షపాతంగా ఉండాలని విద్యాసంస్థల గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవాన్ రెడ్డి పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి జిల్లా పార్టీ కోశాధికారి అనిల్ కుమార్ రాజు పార్టీ నాయకులు శివరామకృష్ణ నీలి రవి రమణ పాత్రుడు జీలకర్ర నాగేంద్ర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!