రాజకీయాలువిశాఖపట్నం
ఎబిఎన్ రాధాకృష్ణ పై చర్యలు తీసుకోండి – కె.కె రాజు

ఏప్రిల్ 9వ తేదీన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుపై చేసిన అనుచిత వ్యాఖ్యలుపై చర్యలు తీసుకోవాలని , ABN రాధాకృష్ణ పైన, ప్రచారం చేసిన వ్యక్తుల అందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ విశాఖపట్నం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె.కె రాజు ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ ,తిప్పల దేవన్ రెడ్డి ,మొల్లి అప్పారావు ,సి.ఇ.సి మెంబర్ కోలా గురువులు, విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ మణకుమారి ,నియోజకవర్గ పరిశీలకులు మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,రొంగలి జగన్నాధం,జహీర్ అహ్మద్ గారు,సతీష్ వర్మ,రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




