విశాఖపట్నం
ఇనార్బీట్ మాల్ లో తప్పిన ప్రమాదం

విశాఖపట్నం /మార్చి30(ట్రూ న్యూస్ )విశాఖ లో కైలాసపురం ప్రాంతం లో ఇటీవల కొత్తగా ప్రారంభమైన ఇనార్బీట్ షాపింగ్ మాల్ లో సోమవారం మధ్యాహ్నం స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్కు ప్లే వుడ్, ఇతర వస్తువులు స్లాబ్ నుంచి పడిపోయాయి. దింతో కొనుగోలు దారులు, భవనం నుంచి కేకలు పెడుతూ పరుగులు తీసారు. మాల్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.




