రాష్ట్రంవిశాఖపట్నం
మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ లు నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా హిట్ టాక్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 11న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ , నయనతారలు నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రేక్షకుల మనసు దోచింది. మంచి కుటుంబ కథ చిత్రం అంటూ ఈ సంక్రాంతికి మంచి సినిమాను అందించారంటూ ప్రేక్షకులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత కుటుంబ వ్యవస్థను, కుటుంబ కలహాలను అపోహలను ఏ విధంగా దూరం చేసుకుని భార్యాభర్తలు జీవితాన్ని గడపాలి అనే మంచి విషయాన్ని ఈ సినిమాలో చూపించారు అంటూ ప్రేక్షకులు అంటున్నారు. హాస్యాన్ని కూడా చక్కగా చూపించారు అంటున్నారు ప్రేక్షకులు. ఈ సంక్రాంతికి మంచి కుటుంబ కదా చిత్రం అందించడంతో ఈ సినిమా బంపర్ హిట్ టాక్ ను అందుకుంది.




