65 వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాపెరుగుతున్న నిత్యావసర ధరలు పై ఆలోచించి ఓటు వేయండి 65 వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని షేక్ జహిరున్నిష

విశాఖపట్నం/అక్టోబర్ 22(ట్రూ న్యూస్) :పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజలు ఆలోచించి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని 65 వార్డు వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థిని షేక్ జహిరున్నిష కోరారు. గురువారం 65 వ వార్డు రామచంద్రా నగర్ లో, పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె స్థానికులతో మాట్లాడారు.వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సమయానికి నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో, ప్రస్తుతం ఎంత మేర పెరిగాయో ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, ధరల పెరుగుదలతో సామాన్యులపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలన్నారు. .తాను స్థానిక అభ్యర్థినని, తనను ఆదరించి గెలిపిస్తే:65 వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని జహిరున్నిష హామీ ఇచ్చారు.ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి, ఆలోచనాత్మకంగా ఓటు వేసి తమ ఓటుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో వార్డు వై ఎస్ ఆర్ సిపి అధ్యక్షులు హబీబ్, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




