రాష్ట్రంవిశాఖపట్నం

ఎస్ ఐ ఆర్ పై అవగాహన కలిగి ఉండాలి

విశాఖపట్నం/జూన్ 12 జూన్  : 15 నుంచి ఎస్ ఐ ఆర్ పై అవగాహన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ మైనార్టీ లు అవగాహన కల్గి వుండాలని ముస్లిం మైనారిటీ నాయకులు తెలియజేసారు.విశాఖపట్నం అక్కయ్యపాలెం తాజ్ బాగ్ దర్గా వద్ద వై ఎస్ ఆర్ సీపీ విశాఖ జిల్లా మైనారిటీ అధ్యక్షులు బర్కత్ అలి ఆధ్వర్యంలో శుక్రవారం జుమ్మ నమాజ్ అనంతరం ఎస్ ఐ ఆర్ అవగాహన కార్యక్రమం పై మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఇదే కార్యక్రమం 2002 లో జరిగిందని, మరల ఈ ఏడాది 2026 లో జరుగుతుందని తెలిపారు. మి ఇంటికి వచ్చిన బి ఎల్ ఓలతో మ్యాపింగ్ ను చాలా జాగ్రత్త గా సరి చూసుకోవాలని తెలిపారు. ఈ విషయం పై ఎటువంటి సందేహాలు వున్నా వై ఎస్ ఆర్ సీపీ మైనార్టీ నాయకులు క్యాంపెన్ లు నిర్వహించి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.మీడియా సమావేశం ముందుగా తాజ్ బాగ్ దర్గా లో హాజరత్ తాజుద్దీన్ ఔలియా నిషాని , మరియు పహాడ్ వాలే బాబా మజార్ పై పవిత్ర వస్త్రం (చాదర్) ను కప్పి, పుషపాలు సమర్పించి, దువ చేశారు. ఈ కార్యక్రమం వై ఎస్ ఆర్ సీపీ విశాఖ సిటీ మైనారిటీ అధ్యక్షులు బర్కత్ అలి, వైసీపీఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఐ హెచ్ ఫరూకి, రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి మహమ్మద్ ఇమ్రాన్, స్టేట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ విశాఖ జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కే వి బాబా, మాజి కొ ఆఫ్సన్ మెంబర్ షరీఫ్,డాక్టర్ జహీర్ అహమ్మద్,ఈస్ట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎం డి మఖబూల్, ఉత్తరనియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎం డి బిలాల్, దక్షిణ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు ఎం డి యాసీన్, వై ఎస్ ఆర్ పి ఉత్తర నియోజకవర్గం జిల్లా మైనార్టీ నాయకులు బాష తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!