విశాఖపట్నం

జర్నలిస్టులకు సంపూర్ణ సహకారం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు పరిశీలిస్తా పెండింగ్ సమస్యలు సత్వరం పరిష్కరిస్తా  ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నేతలతో జిల్లా కలెక్టర్ అభిసిక్త్ కిషోర్

ఏప్రిల్ 23 :విశాఖ జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు తమ వంతు సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అభిసిక్త్ కిషోర్ అన్నారు. గురువారము ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్.. బ్రాడ్ కాస్ట్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లకు చెందిన పలువురు జర్నలిస్టు నేతలు జిల్లా కలెక్టర్ ను ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే ..ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు విశాఖ జిల్లా అధ్యక్షులు

పి నారాయణ లు జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను జిల్లా కలెక్టర్ కు విపులంగా వివరించారు…. జిల్లాలో జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం సి ఎస్ ఆర్ నిధులతో జిల్లా అధికార యంత్రాంగం ద్వారా చెల్లించాలని..

కోరారు.. గతంలో కూడా పలువురు కలెక్టర్లు ఈ విధంగానే చెల్లించారని వీరు తెలియజేశారు.. ఇందులో.. వెటరన్ జర్నలిస్టులను కూడా పరిగణలోకి తీసుకోవాలని వీరు కోరారు.. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు గంట్ల శ్రీను బాబు నారాయణలు తెలిపారు.. అలాగే పెండింగ్ అక్రిడేషన్లు.. ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని తాము కోరడం జరిగిందన్నారు.. జర్నలిస్టుల అన్ని

పెండింగ్ సమస్యలను తెలుసుకుని దశలవారీగా పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది అని వీరు చెప్పారు.. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు .. జర్నలిస్టు నేతలు కలెక్టర్ కు సింహాద్రి నాథుడి జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు..

అలాగే ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర డైరీ ని జిల్లా అధ్యక్షులు నారాయణ కలెక్టర్ కు అందజేశారు

ఈ కార్యక్రమంలో బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు

కార్యదర్శి కింతాడ మదన్.. చిన్న

మధ్యతరహా పత్రికల సంఘం అధ్యక్షులు జగన్మోహన్… బొబ్బర ప్రసాద్. ఫెడరేషన్.. ఉపాధ్యక్షులు.. ఎన్. రామక్రిష్ణ.. పి..నగేష్ బాబు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!