
సున్ని ముస్లిం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 13 సోమవారం నాడు ఒడిస్సా రాష్ట్రం కోరాపూర్ జిల్లాలో నారాయణ పట్నం లో ఉన్న హజరత్ బాబా సయ్యద్ షేర్ అలి మదీనా ఔలియా వారి చందనోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. సోమవారం నాడు ఫజర్ నమాజ్ కు ముందు గుసుల్ షరీఫ్, సాయంత్రం 4 గంటలకు చందనోత్సవం ఊరేగింపు అసర్ నమాజు అనంతరం ఫాతిహా ధరూద్( ప్రత్యేక ప్రార్థనలు) నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న వారందరికీ మధ్యాహ్నం ప్రసాద వితరణ కార్యక్రమం జరుపబడును అని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది సంఖ్యలో కుల మతాలకు అతీతంగా భక్తులు పాల్గొంటారని సమాచారం




