తల్లితండ్రుల ఆప్యాయత తోనే చిన్నారులకు భవిష్యత్తు నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి

విశాఖపట్నం ఏప్రిల్ 11 ట్రూ న్యూస్:పిల్లల భవిష్యత్తు పూలబాటగా మారాలంటే తల్లితండ్రుల అనురాగ ఆప్యాయతలు తప్పనిసరిగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి అన్నారు. విశాఖ పట్నంలోని శ్రీ కాశ్యఫ్ పాఠశాల 21వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో చిన్నారులపై ప్రేమ అనురాగాలు తగ్గించి సంపాదనపై తల్లితండ్రులు శ్రద్ధ చూపుతున్నారన్నారు. తల్లి తండ్రి ఉద్యోగులు అయితే ఆ పిల్లలు ప్రేమ అనురాగ ఆప్యాయతలకు దూరమవుతున్నారని, పాఠశాల నుండి వచ్చిన అనంతరం చిన్నారులు తల్లి తండ్రి అనురాగ ఆప్యాయతలు పొందాలని చూస్తారని కానీ విధి నిర్వహణ నుండి అలసి వచ్చిన తల్లితండ్రులు చిన్నారులతో కొంత సమయం గడపలేకపోతున్నారని దీంతో తల్లి తల్లిదండ్రుల నుంచి చిన్నారులకు ప్రేమ అనురాగ ఆప్యాయతలు లభించడం లేదన్నారు. పూర్వం పాఠశాలకు వెళ్లి వచ్చిన చిన్నారులకు తల్లి తండ్రి ఆప్యాయంగా పలకరించి వారి తో కాలక్షేపం చేసి పురాణ గాథలు, వివరించడమే కాకుండా మంచి నడవడికపై చిన్నారులకు అర్థమైన విధంగా తెలుపుతుండడంతో నేడు ఉన్నత స్థాయిలో ఉన్న వారంతా ఆ విధంగానే సమాజంలో గౌరవప్రదంగా తిరుగుతున్నారన్నారు. నాడు తల్లిదండ్రులు మంచి చెడులపై వివరించడమే కాకుండా వారి భవిష్యత్తులను ఏ విధంగా తీర్చిదిద్దాలి వివరించడమే కాకుండా ఆచార సాంప్రదాయ వంటి వాటిపై సిద్ధార్లకు హితబోధ చేసే వారిని హస్త ఆధునిక యుగంలో అటువంటివి ఎక్కడ కనిపించడం లేదన్నారు. చిన్నారులు పాఠశాల నుండి వస్తే హోంవర్క్ చేయమనడం, తల్లి తండ్రి చుట్టూ తిరిగితే సెల్ఫోన్ చేతికి ఇవ్వడం, లేదా టీవీ పెట్టి చూడమనడం, లేదా ల్యాప్టాప్ సిస్టం లలో వీడియో గేమ్ లో పెట్టి ఆడుకోమనడం వంటి వాటిని చిన్నారులకు అప్పగించడంతో వారు చెడు వైపు పయనించే మార్గం కనిపిస్తుంది అన్నారు. ఇదే కాకుండా అనురాగ ఆప్యాయతలకు దూరమవ్వడంతో పాటు ఆచార సాంప్రదాయాలను సైతం మర్చిపోతున్నారని ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఏ తల్లి తండ్రి అయిన చిన్నారులకు కొంత సమయం గడిపి పాఠశాలలో ఏ విధంగా ఉంది ఏమి చెబుతున్నారు మీ ఏమి చదువుతున్నారు అనే వంటి వాటిపై తెలుసుకోవడమే కాకుండా నీతి కథలు చెబుతూ వారితో కొంత సమయం గడిపినట్లయితే వారి భవిష్యత్తు పూలబాటగా మారుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే కాకుండా కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు పడడం కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తున్నారని దానివల్ల పిల్లల మనసులో చెడు ప్రభావం ప్రారంభం అవుతుందని, వ్యసనాలకు అలవాటు పడిన తండ్రులు పిల్లల ఎదుట అటువంటి వాటిని ప్రదర్శించరాదని వారి ఎదుట జాగ్రత్తగా ఉన్నప్పుడు వారి భవిష్యత్తును తీర్చుదిద్దుకునేందుకు చిన్నారులు ప్రయత్నిస్తారని ఆయన తెలిపారు కావున ప్రతి ఒక్క తల్లి తండ్రి తమ చిన్నారులతో రోజు కొంతసేపు గడపడమే కాకుండా వారికి పాఠశాలలో చెప్పినవి అర్థమయ్యే విధంగా తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం స్కూల్ కరెస్పాండంట్ కే శ్రీనివాస్ , సౌత్ ఇండియా నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ వైస్ చైర్మన్ ఎం వి ఎస్ జి తిలక్ తదితరులు పాలుగున్నారు.




