బిపిఎల్ ప్రీమియర్ లీగ్ విజేతలకు ట్రోఫీ అందజేత

మార్చ్ 28 శనివారం: జీవీఎంసీ 44వ వార్డు ముస్లిం తాటి చెట్ల పాలెంలో బడేగావ్ ప్రీమియర్ లీగ్ 2026 సెషన్ -1ను ఘనంగా నిర్వహించారు. 11 టీంలు ఆడిన అనంతరం బడేగావ్ సూపర్ కింగ్స్ మరియు బడేగావ్ టైటాన్స్ మధ్య హోరాహోరీ ఫైనల్ మ్యాచ్ అనంతరం బడేగావ్ టైటన్స్ విజేతగా నిలిచారు. వారికి మస్జీద్ ఎ క్యూబా అధ్యక్షులు హబీబ్ చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. బడేగావ్ అంటే అర్థం పెద్ద ఊరు ముస్లిం తాటి చెట్ల పాలానికి ఈ పేరుతో పిలుచుకుంటారు.ఈ ఈ టోర్నమెంట్ ను ఆన్సర్ వలి కరీం అనే యువకులు నిర్వహించారు. బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డును ఇషాక్ ఆజమ్, బెస్ట్ బౌలర్ అన్సర్ వలి, బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును మున్వర్ బేగ్, బెస్ట్ క్యాచ్ అవార్డును జోహార్ అలీ అందుకున్నారు.ఈ మ్యాచ్ లకు కామెంట్రీ లుగా బాషా, ఆషిక్ లు తమదైన శైలిలొ భాషణలతో ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ లో పాల్గొన్న టీమ్ సభ్యులు, ఖాజా, నిజాం, మెహబూబ్ బాషా, క్యాటరింగ్ ఖాజా, అలీమ్, అయ్యుబ్, స్థానిక యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




