విశాఖపట్నం

కాంగ్రెస్ నాయకులు పి రజినీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

విశాఖ భీమిలి(ఫిబ్రవరి 16) : విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ  మత్స్యకారుల అధ్యక్షులు పి రజినీకాంత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భీమిలి చేపల మార్కెట్ వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 4000 మంది పైచిలుకు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందని అన్నారు. భగవంతుని కృప వలన వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సవరవిల్లి రామకృష్ణ, విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు మాకెన లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర ఓబిసి జనరల్ సెక్రెటరీ, దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కె.వి సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్  కమలాకర రావు, విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ మైనారిటీ అధ్యక్షులు అర్షద్ బాషా, విశాఖ జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు కస్తూరి వెంకటరావు, మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొడుగు రామారావు, విశాఖ జిల్లా సేవాదళ్ చైర్మన్ చిన్న అప్పారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొడుగు గురుమూర్తి, పొట్టి గురయ్యమ్మ, పొట్టి సంధ్య, పొట్టి సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!