విశాఖపట్నం

వెలగపూడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తూర్పు నియోజకవర్గం ముస్లిం మైనార్టీలు

సోమవారం మహమ్మదీయ మసీద్ యూత్ ఆధ్వర్యంలో ముస్లింల స్మశాన వాటిక(ఖబరిస్తాన్) శుభ్రత కార్యక్రమం  జరిగినది ఈ కార్యక్రమంలో తారా మసీద్ యూత్ అవుట్ గెట్ చిన్న వాల్తేరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మశాన వాటిక (ఖబరిస్తాన్) లో నీటి కోసం ఇబ్బంది పడుతున్నట్లు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబుకు తెలపగా  వెంటనే ఆయన స్పందించి  వాటర్ పైపును ఏర్పాటు చేయించారని తెలిపారు. అలాగే మరి కొన్ని రోజులలో రంజన్ మాసం ప్రారంభం కావడంతో  స్మశాన వాటిక లోపల భాగంలో పెయింటింగ్ మరియు శుభ్రత గూర్చి మున్సిపల్ వర్కర్ ను కేటాయించమని కోరగా సరే అంటూ హామీ ఇచ్చారని తెలిపారు. 21వ వార్డు అధ్యక్షులు అమరేంద్ర  మరియు అవినాష్ లు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారని తెలిపారు. కార్యక్రమంలో చిన్న వాల్తేరు మసీదు ప్రెసిడెంట్ షరీఫ్,  ముస్తఫా, మరియు యూత్ ప్రెసిడెంట్ ఖాదర్ బాబా, తారా యూత్ మసీద్ ప్రెసిడెంట్, చిన్న వాల్తేర్ తారా మసీద్ యూత్  పాల్గొన్నారు. వెలగపూడి రామకృష్ణ బాబుకు అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!