విశాఖపట్నం
జివిఎంసి 26 వ వార్డు చిన్నూరు మసీదు వద్ద బ్రిడ్జి పనులు పూర్తిచేయండి లేదంటే ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది – విశాఖ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు

జీవీఎంసీ 26 వ వార్డు చిన్నూరు మసీదు వద్ద ఉన్న బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా అధ్యక్షులు, ఇట్స్ ట్రూ న్యూస్ డిజిటల్ మీడియా చైర్మన్ షేక్.బాషా ట్రూ న్యూస్ ముఖంగా కోరారు. బ్రిడ్జ్ లో ఉన్న చెత్త చెదారం వలన ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.పక్కనే అంగన్వాడి స్కూల్ కూడా ఉంది.ప్రభుత్వ అధికారులు ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని ఆయన కోరారు.




