టాటా – ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో యలమంచిలి వద్ద అర్ధరాత్రి మంటలు.. ఒకరు సజీవ దహనం

విశాఖపట్నం/యలమంచిలి డిసెంబర్ 29 దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా – ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రెండు ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు.ఆదివారం రాత్రి దువ్వాడ మీదుగా బయల్దేరిన ఎర్నాకులం ఎక్సప్రెస్ అనకాపల్లి కి ఆలస్యంగా వచ్చింది.అక్కడి నుంచి బయల్దేరిన అనంతరం నరసింగబిల్లి వద్ద బి -1ఏసీ బోగి బ్రేకులు పట్టేయడంతో అగ్ని కిలలు ఏర్పడినట్టు సమాచారం.దింతో రైలులో ఫ్యాంట్రీ కారును అనుకుని వున్న బి -1,ఎం -2 ఏసి బోగిల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని యలమంచిలి సమీపంలోని పోయింట్ వద్ద లోకో ఫెలట్లు గుర్తించి యలమంచిలి స్టేషన్ లో నిలిపివేశారు. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి, నుంచి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనస్థలానికి చేరుకొని మంటలు అర్పివేశారు. కానీ అప్పటికే రెండు బో్గీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే బి-1 బో్గీలో ఒకరు సజీవ దహనం అయి నట్టు సమాచారం. మృతుడు విశాఖపట్నం కు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) గా గుర్తించారు. కాగా రైల్వే ఉన్నతాధికారులు ప్రమాద స్టలికి చేరుకొని పరీశీలించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ-ఫ్ మార్గంలో రైళ్ల్లు అన్ని నిలిపివేశారు. అర్ధరాత్రి 3.30 దాటిన తరువాత కాలిపోయిన రెండు బో్గీలను తొలగించారు. ప్రమాదం జరగడంతో రెండు బోగిల్లోని ప్రయాణికులు చలిలోనే స్టేషన్ లో చాలా సేవు పడిగాపులు కాస్తూ ఉండిపోయారు. దింతో వారిని రైల్వే అధికారులు, మూడు ఆర్టీసీ బస్సుల్లో సామర్లకోట రైల్వే స్టేషన్ కు తరలించారు.సామర్లకోట లో రెండు ఏసీ బోగిలను జతచేసిఅక్కడి నుంచి ఎర్నాకుళం తరలించారు.




