విశాఖపట్నం

44 వార్డులో సమస్యలపై ఆర్డిఓ జోనల్ కమిషనర్లకు వినతి పత్రాన్ని అందజేసిన షేక్ బాషా

విశాఖపట్నం సెప్టెంబర్ 11 శుక్రవారం ట్రూ న్యూస్ : జీవీఎంసీ 44వ వార్డ్ అక్కయ్యపాలెం షాదీ ఖానా లో (ONE MONTH – ONE CONSTITUENCY) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, విశాఖపట్నం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం నాయకులు షేక్. బాషా పాల్గొని జీవీఎంసీ 44 వార్డ్ లో ఉన్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని కుళాయి నీటి సరఫరా 45 నిమిషాలు సమయంతో సరఫరా చేస్తున్నారు కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా పది నిమిషాలు పెంచమని, అలాగే గత కాలంలో ఉదయం వేళ నీటి సరఫరా ఇచ్చేవారని మరలా అదే సమయాన్ని కొనసాగిస్తే బాగుంటుందని, అలాగే పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ సమయాన్ని పొడిగించాలని, పారిశుధ్యం పై కాస్త శ్రద్ధ చూపాలని తదితర సమస్యలపై వినతి పత్రాన్ని ఆర్డీఓ కే సంగీత్ మధుర్, జోనల్ కమిషనర్ బి రాము లకు, ఎమ్మార్వో ఎం వి వి ప్రసాద్ లకు వినతి పత్రాన్ని అందజేశారు. అయితే వారు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!