విశాఖపట్నం
ఈ నెల 5,6 న ఘనంగా హజరత్ తాజద్దీన్ షాహ్ ఖాద్రి ఔలియా వారి ఉర్సు ఉత్సవాలు మతాలకు అతీతంగా పాల్గొని బాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరిన యారాడ దర్గా కమిటీ

విశాఖపట్నం యారాడ కొండపై ఉన్న హజరత్ బాబా తాజుద్దీన్ షాహ్ ఔలియా వారి 36వ ఉర్సు ఉత్సవాలు ఈనెల అనగా మే 5 మరియు ఆరు తేదీలలో జరగదున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలియజేశారు.05-05-2026 మంగళవారం రాత్రి 7గ”లకు దైవ గ్రంధం ఖురాన్ పఠనంతొ మొదలుకానుంది. రాత్రి 9గ”లకు భక్తులందరికీ విందు కార్యక్రమం రాత్రి 10గ”లకు గంధం తయారీ.మే 06 బుధవారం 12:15గ’లకు గుసుల్ 2:15గ”లకు చందనం సమర్పించడం జరుగును. ఉదయం ఫజర్ నమాజ్ అనంతరం 5:30గ”ల నుండి బాబా వారి చాదర్ ఊరేగింపు అనంతరం చాదర్స మర్పణ ఫాతిహా దరూధ్ ప్రత్యేక ప్రార్థనలు జరుగును. 7గ”ల నుండి సాయంత్రం 6గ”ల వరకు ప్రసాద్ విత్తన కార్యక్రమం జరుగును. ఈ ఉత్సవాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని బాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలని దర్గా కమిటీ సభ్యులు కోరారు.




