జివిఎంసి సౌత్ జోన్లో ప్రత్యేక రెవెన్యూ (ట్యాక్స్) మేళాలు

ఏప్రిల్ 25 నుండి 30 వరకు నిర్వహణ జివిఎంసి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, సౌత్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీ ఎం. మల్లయ్య నాయుడు గారు సౌత్ జోన్ పరిధిలో ప్రజలకు ఆస్తి పన్ను సంబంధిత సేవలను వేగవంతంగా మరియు సులభతరంగా అందించేందుకు ప్రత్యేక రెవెన్యూ (ట్యాక్స్) మేళాలను 25.04.2026 నుండి 30.04.2026 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ప్రత్యేక మేళాలలో కొత్త ఆస్తి పన్ను అసెస్మెంట్, యాజమాన్య మార్పిడి (మ్యూటేషన్), భవన మార్పులు / అదనపు నిర్మాణాలు, ఆస్తి విభజన, రివిజన్ పిటిషన్లు తదితర సేవలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించబడతాయి.ప్రజల సౌకర్యార్థం సౌత్ జోన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు.దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ పత్రాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (EC), ఆధార్ ప్రతులు, లింక్ డాక్యుమెంట్లు మరియు అవసరమైన ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు.ఈ మేళాల నిర్వహణలో జోనల్ కమిషనర్ గారి అధ్యక్షతన రెవెన్యూ ఆఫీసర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలియజేశారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆస్తి పన్ను సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.




