విశాఖపట్నం
మంటల్లో కాలిపోయిన పాత భవనాన్ని పరిశీలించిన కొయిలాడ వెంకటేష్

జీవీఎంసీ 44వ వార్డు అక్కయ్యపాలెం ప్రాంతంలో పాడుబడిన సాయి బృందావన్ స్కూల్ భవనంలో గత రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశారు. టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు కొయిలాడ వెంకటేష్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన విషయాలను స్థానికులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రాంతాన్ని పరిశుభ్రం చేయవలసిందిగా పారిశుద్ధ్య సిబ్బందికి తెలియజేశారు.




