ఫుట్ బాల్ టోర్నమెంట్ కు వేణు ప్రోత్సాహం అభినందనీయం వాసుపల్లి చేతుల మీదుగా రూ.10,000 సహాయం

ఫుట్బాల్ క్రీడలకు చేయూతనందించిన వైయస్సార్సీపి 30వ వార్డు బీసీ సెల్ అధ్యక్షుడు వేణు ప్రోత్సాహం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అభినందించారు. ఈ మేరకు ఆశీర్లమెట్ట కార్యాలయంలో వేణు సమకూర్చిన రూ.10,000 నగదును మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ చేతులమీదుగా క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ హరీష్ మెమోరియల్ ఫ్లూడ్ లైట్ బీచ్ 5 ఏ సైడ్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ బాయ్స్ కు అభినందనలు తెలియజేస్తూ క్రీడలు విజయవంతం కావాలని వాసుపల్లి ఆకాంక్షించారు. గంగమ్మ తల్లి ఆలయం వద్ద కోస్టల్ బ్యాటరీ బీచ్ గ్రౌండ్స్ లో జరగనున్న ఫుట్బాల్ క్రీడలకు 30 వార్డ్ బీసీ సెల్ అధ్యక్షుడు వేణు ప్రోత్సాహం అందించారన్నారు. క్రీడాకారులకు కాన్ఫిడెన్స్ తో పాటు సెల్ఫ్ డిఫెన్స్, గెలుపు ఓటమిలు తీసుకోవాలన్నారు. క్రీడాకారులకు ఇటువంటి ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు తీసుకువస్తారని వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ళ రామరాజు జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భరత్, స్టేట్ సంస్కృత విభాగం సెక్రెటరీ సాగర్,చోడపిళ్లి శివ, చేపల నూకరాజు టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు, 30వ వార్డు దక్షిణ వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.




