
ముస్లింలకు రెండవ అతిపెద్ద పండగ అయిన ఈద్ – ఉల్ – అద్హా (బక్రీద్) తేదీపై సస్పెన్స్ వీడింది. ఇస్లామిక్ క్యాలెండర్ నెల ప్రకారం ఆదివారం నాడు నెలవంక భారత్ లో కనబడలేదు. కావున ఈనెల 27 కు బదులు 28(గురువారం) నాడు బక్రీద్ పండుగ జరుపుకోనున్నట్లు ముస్లిం మత పెద్దలు స్పష్టం చేశారు. కావున ప్రభుత్వం ఈనెల 28న సెలవు ప్రకటించే అవకాశం ఉంది.




