రాజకీయాలువిశాఖపట్నం

కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో ఫ్లెక్సీలు పెట్టి, శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు.- కె.కె రాజు

విశాఖపట్నం జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు  కె.కె రాజు  ఆధ్వర్యంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పవిత్రమైన తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి నేతలు చేసిన ఆరోపణలు నేపథ్యంలో హిందువుల మనోభావాలను కించపరిచి, కూటమి నేతలు చేసిన అబద్ధపు ఆరోపణలపై మరియు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి తప్పుడు ప్రచారాలతో ఫ్లెక్సీలను విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం హైవే జంక్షన్ లో దొంగ చాటుగా ఎవరు ఏర్పాటు చేశారో తెలియని పరిస్థితులలో అబద్ధపు ప్రచారం చేసిన కూటమినేతలపై మరియు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై, కఠినమైన చర్యలు తీసుకోవాలని 4వ పట్టణ పోలీసు స్టేషన్ సి.ఐ ను కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వరుదు కల్యాణి సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి ,మొల్లి అప్పారావు ,రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం ,డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,కార్పొరేటర్లు అల్లు శంకరరావు,సాడి పద్మారెడ్డి,పి.వి సురేష్,రెయ్యి వెంకటరమణ,బర్కత్ అలీ,రాష్ట్ర&జిల్లా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!