తారా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా హజరత్ ఖ్వాజా గారీబ్ నవాజ్,హజరత్ ఖాదర్ వలి ఔలియా ఉర్సు ఉత్సవాలు
మూడు రోజులపాటు ప్రసాద వితరణ కార్యక్రమం

విశాఖపట్నం:డిసెంబర్ 28 అదివారం(ట్రూ న్యూస్) మద్దిలపాలెం మంగాపురం కాలనీ తార మసీదు యూత్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హజరత్ ఖాదర్ వలీ ఔలియా, మరియు హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా డిసెంబర్ 26 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మగ్రిబ్ నమాజ్ అనంతరం ఫాతెహా దరూద్ (ప్రత్యేక ప్రార్థనలు) రాత్రి 9 గంటలకు ఇషా నమాజ్ అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు హజరత్ అల్లామా వ మౌలానా ఇహసాన్ రజా మచిలీపట్నం వారి ఆధ్యాత్మిక ప్రసంగం జరిగింది. ప్రసంగం లో ఆయన ఔలియా వారు మానవాళికి ఇచ్చిన సందేశం, పరులపట్ల చూపవలసిన ప్రేమ కరుణ, తదితర అంశాలను క్లుప్తంగా వివరించారు. శనివారం నాడు చందనోత్సవం ఊరేగింపుగా జరిగింది. ఆదివారం నాడు ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మూడు రోజులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విశాఖ నలుమూలల నుండి మతాలకు అతీతంగా పాల్గొన్నారు.




