రోబోటిక్ సర్జరీలతో కిడ్నీ చికిత్సలో కొత్త ప్రమాణాలు – ఏఐఎన్‌యూ విశాఖ ముందడుగు
విశాఖలో ఏర్పాటుచేసిన ఏఐఎన్‌యూ ఆస్పత్రి యూరాలజీ శస్త్రచికిత్సలలో సరికొత్త మైలురాయి

డిసెంబర్ 23, 2025: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా యూరాలజీ, నెఫ్రాలజీ రంగాల్లో శస్త్రచికిత్సల కోసం ప్రత్యేకంగా రోబోను ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ప్రవేశపెట్టింది. విశాఖపట్నంలోని తమ ఆస్పత్రిలో ఈ రోబోను ఏర్పాటుచేయడం ద్వారా యూరాలజీ, నెఫ్రాలజీ శస్త్రచికిత్సలలో అత్యంత కచ్చితత్వాన్ని సాధించడంలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సింగిల్ స్పెషాలిటీ కిడ్నీ ఆస్పత్రిగా పేరొందిన ఏఐఎన్‌యూ.. ఇప్పుడు అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. రోగుల దృష్టికోణంలో చూస్తే.. అత్యాధునిక యూరాలజికల్ చికిత్సలన్నీ ఒకేచోట లభిస్తాయి. ఆధునిక రోబోటిక్ టెక్నాలజీతో సహా ఏఐఎన్‌యూలో అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రోబోటిక్ ప్రోస్టేట్ సర్జరీలు, సంక్లిష్టమైన యూరలాజికల్, రీకన్‌స్ట్రక్టివ్ చికిత్సలు, పిల్లల యూరాలజీ సర్జరీలు, పాక్షిక నెఫ్రక్టమీ, కిడ్నీ మార్పిడులు ఉన్నాయి. ఇప్పుడు రోబో చేరికతో విశాఖలో అత్యంత సమగ్ర యూరాలజీ ఆస్పత్రిగా ఏఐఎన్‌యూ నిలిచింది. కొత్తతరం రోబోటిక్ సర్జరీ టెక్నాలజీతో అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం సర్జన్లు 3డి హైడెఫినీషిన్ వ్యూతో, పదిరెట్లు పెద్దగా చూస్తూ చేతి వణుకు లేకుండా మనుషుల చేతి కంటే అసాధారణ కచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేయగలరు. దీనివల్ల రోగులకు చిన్నపాటి కోతలు, నొప్పి లేకపోవడం, త్వరగా కోలుకోవడం, మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటివరకు యూరాలజీ రంగంలో చిన్న కోతలతో చేసే శస్త్రచికిత్సలే ఉండగా, వాటిని ఈ రోబో విధానం పునర్నిర్వచించింది. ఇక్కడ పలువురు సర్టిఫైడ్ రోబోటిక్ సరజన్లు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక పరీక్షలు, ప్రత్యేకమైన పెరిఆపరేటివ్ బృందం ఉండడంతో సత్ఫలితాలు సాధ్యమవుతున్నాయి. దీనివల్ల యూరాలజీ, కిడ్నీ సమస్యలకు రోబోటిక్ సర్జరీల కోసం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల వాసులు ఇక పెద్దనగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రోస్టేట్ క్యాన్సర్ సర్జరీలు, రాడికల్ ప్రోస్టేటెక్టమీ, పాక్షిక, రాడికల్ నెఫ్రక్టమీ, పైలోప్లాస్టీ, యూరెటెరిక్ రీఇంప్లాంటేషన్, బ్లాడర్ సర్జరీలు, యూరేటెరిక్ స్ట్రిక్చర్ రీకన్‌స్ట్రక్షన్, సంక్లిష్టమైన కన్‌స్‌్రఇక్టివ్ యూరాలజీ, పిల్లల రోబోటిక్ యూరాలజీ సర్జరీలు ఇక్కడి రోబోటిక్ సర్జరీ వ్యవస్థతో సాధ్యమవుతాయి. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ మాట్లాడుతూ, “విశాఖపట్నంలోని ఈ కిడ్నీ ఆస్పత్రిలో అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం అనేది నాణ్యమైన వైద్యచికిత్సల అందుబాటులో కొత్త శకం అవుతుంది. అత్యాధునిక వైద్య రంగంలో విశాఖ పురోగతిని ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీలు రుజువు చేస్తాయి. కిడ్నీ చికిత్సల్లో రోబోటిక్ విధానం వల్ల రోగులకు సురక్షితమైన చికిత్సలు, తక్కువ అసౌకర్యం, వేగంగా కోలుకోవడం సాధ్యమవుతాయి” అన్నారు. రోబో ఆవిష్కరణ సందర్భంగా ఏఐఎన్‌యూ విశాఖ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, యూరో ఆంకాలజిస్ట్, లాపరోస్కొపిక్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ జి.రవీంద్రవర్మ మాట్లాడుతూ, “ఈ అత్యాధునిక సామర్థ్యంతో మేం సంక్లిష్టమైన సర్జరీలను కూడా అత్యంత కచ్చితత్వంతో చేయగలం. రోగికి నొప్పి తగ్గుతుంది, మచ్చలు ఉండవు, త్వరగా కోలుకుంటారు. ప్రోస్టేటిక్ క్యాన్సర్ కేసుల్లో, ముఖ్యంగా రాడికల్ ప్రోస్టేటెక్టమీ చేయాల్సి వచ్చినప్పుడు ఓపెన్ శస్త్రచికిత్సల కంటే కణితిని అత్యంత కచ్చితంగా తీయగలం. రక్తస్రావం తగ్గుతుంది, ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గుతుంది, త్వరగా కోలుకుంటారు. మా ఆస్పత్రి అభివృద్ధిలో ఈ రోబోటిక్ ప్లాట్‌ఫాం చేర్చడం ఒక సరికొత్త మైలురాయి. మరింత కచ్చితత్వం, భద్రతతో చికిత్సల్లో అత్యున్నత ప్రమాణాలు దీనివల్ల సాధ్యమవుతాయి. దాంతో రోగులకు నాణ్యమైన జీవితం లభిస్తుంది” అని తెలిపారు. ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యూరో ఆంకాలజిస్ట్, లాపరోస్కొపిక్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ అమిత్ సాప్లే మాట్లాడుతూ, “సంక్లిష్టమైన సమస్యలకు చేసే చికిత్సల తీరును రోబోటిక్ సర్జరీలు సమూలంగా మారుస్తాయి. దీనివల్ల సర్జన్లు రోగులకు అసాధారణ ఫలితాలు అందించడంతో వారు త్వరగా కోలుకుంటారు” అన్నారు. ఈ ఆవిష్కరణ గురించి ఆస్పత్రి సీఈఓ సందీప్ గూడూరు మాట్లాడుతూ, “విశాఖ ఏఐఎన్‌యూలో రోబోటిక్ సిస్టమ్ ప్రవేశపెట్టడంతో అత్యున్నత సాంకేతిక విషయంలో మా నిబద్ధత తెలుస్తుంది. ఏఐఎన్‌యూలో సాంకేతిక అభివృద్ధి లక్ష్యం ఒకటే.. రోగులకు మెరుగైన చికిత్సలు అందించడం. రోబోటిక్ విధానంలో మరింత సురక్షితమైన, తక్కువ నొప్పిగల శస్త్రచికిత్సలు అందుతాయి. రోగులు త్వరగా కోలుకుకుని, సాధారణ జీవితం గడపగలరు” అని చెప్పారు.

