ఉమ్రాయాత్రికులను సత్కరించిన కె.వి బాబా

విశాఖపట్నం డిసెంబర్/22(ట్రూ న్యూస్)….మర్రిపాలెం, ఎక్స్ సర్వీస్ మెన్ కాలని కి చెందిన ఏడుగురు ముస్లిం లు మక్కా, మదీనాలు దర్శించుకునేందుకు ఈ నెల 24 వ తేది బుధవారం ఉమ్రా కు వెళ్ళనున్నారు. ఈ మేరకు ఉమ్రా కు వెళ్ళనున్న హాజీ ఖాదర్ బాబా, మొహమ్మద్ జిక్రియ, అబ్దుల్ ఖాదర్ జీలాని, మదీన వలి, సైదా బేగం, షకీన బీబీ, సుభాన్ బీబీ లను విశాఖపట్నం మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, స్టేట్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జెనరల్ సెక్రటరీ కే వి బాబా వారిని శాలువా వేసి, పుష్పగుచ్చాలు ఇచ్చి(గుల్ ఫోషి) సత్కరించారు. ఈ సందర్బంగా కే వి బాబా మాట్లాడుతు ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారి ఐనా హజ్ చేయాలన్నది విధి అని, కానీ కొంతమంది ఆ భాగ్యం లభించదని,హజ్ చేస్తే అప్పుడే పుట్టిన శిశువు ఎంత పవిత్రంగా ఉంటుందో, అంత పవిత్రంగా మనిషి మారుతాడన్నది విశ్వాసమని అన్నారు. హజ్ చేసిన వ్యక్తి గతంలో చేసిన పాపాలన్నిటినుండి విముక్తి లభిస్తుందన్నది ముస్లింల విశ్వాసమని కాబట్టి హజ్ ఆచరించడం ద్వారా పరిపూర్ణమైన ముస్లిం లుగా మారుతారన్నది ముస్లిం ల విశ్వాసం అని అన్నారు. హజ్ చేయలేని వారు కనీసం ఉమ్రా యాత్ర లో భాగంగా మక్కా, మదీనాలను దర్శించుకుని అల్లాహ్ ను ప్రార్ధించాలని ఉమ్రా యాత్ర కు వెళుతున్న వారిని కోరారు. పవిత్ర ఉమ్రా యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్సించారు. ఈ కార్యక్రమం లో హాజీ అదం, సుభానల్లా, మదీన వలి, ఎస్ కె భాష, దౌలత్ హుసేన్, ఎం డి అర్కం, సిలారస, గౌసియా బీబీ, లియాఖత్ భాను, జానీ తదితరులు పాల్గొన్నారు.



