సాంకేతికత

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

విశాఖపట్నం, ఉత్తర నియోజకవర్గం ,సెప్టెంబర్ 18 గురువారం ఉత్తర నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్  పీ. విష్ణుకుమార్ రాజు  చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులకు అందజేసిన చెక్కుల వివరాలు:

25వ వార్డు గాయత్రి  ₹20,000,

25వ వార్డు వెంకట్రావు  ₹83,731,

25వ వార్డు సంధ్య రాణి  ₹23,400,

44వ వార్డు నాగమణి  ₹78,854,

44వ వార్డు అబ్దుల్ వాజిదునిష గ ₹65,000,

47వ వార్డు పిల్లి వరలక్ష్మి  ₹1,68,280,

పి. సుహాసిని  ₹67,479,

సన్యాసమ్మ  ₹25,000,

అనిల్ కుమార్  ₹20,000,

రవి వర్మ ₹30,786,

కృష్ణవేణి  ₹1,00,424,

వెంకటరమణ  ₹25,000,

శైలజ  ₹1,11,282,

దేవి  ₹25,000,

శ్రీరామ్ మూర్తి ₹30,000,

గుర్రమ్మ  ₹60,807,

వీర వెంకట కిషోర్ ₹45,000.

మొత్తం ₹9,80,049 విలువైన చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు  మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కేజీహెచ్ హాస్పిటల్‌ను ఆశ్రయించాలని, అక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు ఉత్తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎవరికైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండి హాస్పిటల్ ఖర్చులకు సంబంధించిన బిల్లులు ఉంటే వెంటనే ఎమ్మెల్యే కార్యాలయ దృష్టికి తీసుకురావాలని కోరారు. అవసరమైతే పెద్ద ఆసుపత్రుల్లో చేరకముందే ఎస్టిమేషన్ బిల్లుతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించి సహాయం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ గారు, కంటిపాము కామేశ్వరి , సారిపల్లి గోవింద్ , శ్యామల దీపిక , వెంకటేశు, వాసు, ప్రసాదు, అనీలు, నాగమణి, అరుణ, అరుణ్ బాబు, జగదీష్, కిషోర్, శ్రీనివాసు, కూటమి మండల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!