విశాఖపట్నం
ఈనెల 9,10న జరుగు హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఉర్సు ఉత్సవాలకు కోయిలాడ వెంకటేష్ కు ఆహ్వానం

జీవీఎంసీ 44వ వార్డు ముస్లిం తాటి చెట్ల పాలెంలో హజరత్ ఖాదర్ వలీ ఔలియా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 9,10న హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఉర్సు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. జనవరి 9 శుక్రవారం దైవ గ్రంథం ఖురాన్ పఠనం, సాయంత్రం చందనోత్సవ ఊరేగింపు, అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. జనవరి 10 శనివారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులచే ప్రసంగం, అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరగనుంది. ఈ ఉత్సవాలకు ఎ.క్యూ.జె సంస్థల వైస్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు కోయిలాడ వెంకటేష్ ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు.




