మతం
ఈనెల 9,10న జరుగు హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఉర్సు ఉత్సవాలకు ఐ హెచ్ ఫారుఖికి ఆహ్వానం

జీవీఎంసీ 44వ వార్డు ముస్లిం తాటి చెట్ల పాలెంలో హజరత్ ఖాదర్ వలీ ఔలియా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 9,10న హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఉర్సు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. జనవరి 9 శుక్రవారం దైవ గ్రంథం ఖురాన్ పఠనం, సాయంత్రం చందనోత్సవ ఊరేగింపు, అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. జనవరి 10 శనివారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులచే ప్రసంగం, అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరగనుంది. ఈ ఉత్సవాలకు ఎ.క్యూ.జె సంస్థల వైస్ చైర్మన్, రాష్ట్ర వైఎస్ఆర్సిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఐ.హెచ్.ఫారుఖిని కమిటీ సభ్యులు ఆహ్వానించారు.




