విశాఖపట్నం
44 వార్డులో కుక్కల బెడద

జీవీఎంసీ 44 వార్డులో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ముస్లిం తాటి చెట్ల పాలెంలో కుక్కలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చీకటి పడితే మూకుమ్మడిగా కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయూ అని భయపడుతున్నారు.సంబంధిత అధికారులు ఈ సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నారు.




