విశాఖపట్నం
ఎన్.టి.ఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన హెచ్ఆర్సి విశాఖ జిల్లా అధ్యక్షులు షేక్.బాషా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు, దివంగత నేత నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్భంగా విశాఖ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు షేక్.బాషా అక్కయ్యపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో షేక్.గౌస్, షేక్ మదీనా,ఎం.డి గౌస్, షేక్.ఆషిక్ తదితరులు పాల్గొన్నారు.




