విశాఖపట్నం
ఒక రోజు ముందుగా 31నే పింఛన్ల పంపిణీ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

విశాఖపట్నం, డిసెంబర్ 26 ట్రూ న్యూస్ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం 01.01.2026న పంపిణీ చేయాల్సిన సామాజిక భద్రతా పింఛన్లను 31.12.2025నే పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆ రోజు ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకు వచ్చి పింఛన్లను అందజేస్తారన్నారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ సజావుగా జరిగేందుకు డిసెంబర్ 30న అవసరమైన నగదు డ్రా చేసేందుకు చర్యలు తీసుకోవాలని డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ ను ఆదేశించామన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా సూచించారు.




