విశాఖపట్నం

బ్యాడ్మింటన్ పోటీల్లో కార్పొరేటర్ ఉషశ్రీ ‘గోల్డ్’ మెడల్స్ జోరు క్రీడల్లో తమ సత్తా చాటుతున్న ఉషశ్రీ ​జిల్లా స్థాయి మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు కైవసం

విశాఖపట్నం:ఫిబ్రవరి 08 గాజువాకలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026 పోటీల్లో జీవీఎంసీ 43వ వార్డు కార్పొరేటర్ ఉషాశ్రీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ టోర్నమెంట్‌లో ఆమె ఏకంగా మూడు విభాగాల్లో బంగారు పతకాలను సాధించి క్లీన్ స్వీప్ చేశారు.45 ఏళ్ల పైబడిన (45+) విభాగంలో జరిగిన పోటీల్లో ఉషాశ్రీ తన ప్రతిభతో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అద్భుత పోరాట పటిమ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.సమన్వయంతో ఆడి స్వర్ణ పతకాన్ని సాధించారు.
​ఈ విభాగంలోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్‌తో జిల్లా ఛాంపియన్‌గా నిలిచారు.
​ఒకే టోర్నీలో మూడు విభాగాల్లో విజేతగా నిలిచిన కార్పొరేటర్ ఉషాశ్రీని తోటి కార్పొరేటర్లు, క్రీడాకారులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. ఈ విజయం పట్ల ఆమె స్పందిస్తూ.. నిరంతర సాధన, క్రీడల పట్ల ఉన్న మక్కువతోనే ఈ విజయం సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!