రాజకీయాలువిశాఖపట్నం

26 వ వార్డు బ్రిడ్జి సమస్యపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలపై స్పందించిన వార్డు అధ్యక్షుడు ముక్కా కిషోర్ కుమార్

జీవీఎంసీ 26 వార్డు చిన్నూరు మసీదు వద్ద గత సంవత్సరం ఆగస్టులో శంకుస్థాపన చేసిన కల్వర్టు బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు  పూర్తి కాకపోవడంతో స్థానికులు ఫిర్యాదులతో సోషల్ మీడియాలో మరియు కొన్ని పత్రికలలో వచ్చిన కథనంపై అ వార్డు టిడిపి అధ్యక్షుడు ముక్కా కిషోర్ కుమార్ స్పందించారు.గతంలో చిన్నూరు గ్రామస్తులు తన దగ్గరకు వచ్చి బ్రిడ్జి శిథిలావస్థలో ఉందని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తన దృష్టికి తీసుకువస్తే వెంటనే కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లి బ్రిడ్జి పునర్నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించి గత సంవత్సరం ఆగస్టులో శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.గతంలో ఉన్న అధికారులు నిధుల మంజూరు విలువలు తక్కువ ఇవ్వడంతో బ్రిడ్జి నిర్మాణ పనులలో ఆలస్యమైందని తెలిపారు. ఈ విషయాన్ని తాను సంబంధిత అధికారులు దృష్టిలో పెట్టానని మరో 5.6 రోజులలో సరియైన నిధుల మంజూరు విలువలు ప్రభుత్వానికి అందజేసి బ్రిడ్జి మరమ్మతు పనులు మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రంజాన్ లోపు బ్రిడ్జి పనులు పూర్తిచేసి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ చిన్నూరు ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ఎలాంటి వ్యక్తిగత కారణాలు గాని ఏ ఇతరత్ర కారణాలు గాని లేవని ఎలాంటి సమస్య వచ్చినా 26 వార్డు ప్రజలకు  అండగా ఉంటానని ముక్కా కిషోర్ కుమార్ పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!