ఈనెల 25న యారాడ దర్గాలో ఘనంగా ఖ్వాజా గరీబ్ నవాజ్ ఉర్సు ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా పాల్గొనాలని కమిటీ సభ్యుల మనవి

విశాఖ గాజువాక మండలం యారాడ కొండపై హజరత్ తాజుద్దీన్ షా ఖాద్రి దర్గా షరీఫ్, హజార్ షేక్ ఫరీద్ షక్కర్ గంజ్ ఔలియా వారి చిల్ల షరీఫ్ ( ధ్యాన మందిరం) ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దర్గా వద్ద రాజస్థాన్ అజ్మీర్ షరీఫ్ లో ఉన్న హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఔలియా వారి గుర్తుగా ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు ఇట్స్ ట్రూ న్యూస్ డిజిటల్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 25 ఆదివారం 10గ”లకు చందనోత్సవం, జెండా ఎగురవేత, ప్రత్యేక ప్రార్థనలు అనంతరం10: 30గ”ల నుడి సాయంత్రం 4గ”ల వరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరగనున్నట్లు కమిటీ సభ్యులు ఇట్స్ ట్రూ న్యూస్ డిజిటల్ మీడియాకు తెలిపారు.ఈ ఉర్సు ఉత్సవాలలో కుల మతాలకు అతీతంగా పాల్గొని బాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు ఇట్స్ ట్రూ న్యూస్ మీడియా ముఖంగా కోరారు.




