విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ రచించిన వక్ఫ్ లాస్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి యు.దుర్గా ప్రసాద్ గౌరవ అతిథిగా పాల్గొన్న ఐ.హెచ్.ఫారుఖి

చట్టాల పై ప్రతిఒక్కరు అవగాహాన కలిగి ఉంటేనే వ్యవస్ధలలో మార్పు సాధ్యం అవుతుందని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి యు దుర్గాప్రసాద్ అన్నారు.. విజయవాడ వన్ టౌన్ మూసాఫిర్ ఖానాలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎమ్ డి ఇంతీయాజ్ అహ్మద్ రచించిన వక్ఫ్ లాస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు..ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ లాస్ అనే పుస్తకం లో వక్ఫ్ చట్టం అంటే ఏమిటి అందులో విధి విధానలు సరళమైన భాషలో సామ్యాన్యుడికి సైతం అర్థమయ్య భాషలో వివరించాని అన్నారు. ఈపుస్తకం చదవడం అంటే వక్ఫ్ చట్టం పై అవగాహనతో పాటు విజ్ఞానం కలుగుతుందని అన్నారు. 1954 మొట్టమొదటి స్వాతంత్ర్య భారత దేశంలో మొట్ట మొదటీ వక్ఫ్ లా గురించి ఆతరువాత 1995లో ,2013లో 2024లో వక్ఫ్ ఎమాండ్మెంట్ గురించి పూర్తిగా సరళమైన భాషలో రాశారని అన్నారు. ఈ సందర్భంగా మాజి ఐఎఎస్ , రచయిత ఇంతియాజ్ అహమ్మద్ మాట్లాడుతూ 2024లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టసవరణ పై సమగ్రమైన సమాచారం అందించడం జరిగిందని అదేవిధంగా అంతుకు ముందన్న చట్టలు సవరణలు పూర్తిగా వివరించడం జరిగిఞదన్నారు.ఈ బుక్ ను ముద్రణకు సహకరించిన డక్కన్ లా హౌస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, రాష్ట్ర మైనారిటీ నాయకులు ఐ.హెచ్.ఫారుఖి పాల్గొన్నారు. ఇంతియాజ్ అహ్మద్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహితి ప్రముఖు లు గోళ్ళ నారయణ,డక్కన్ హౌస్ అనిల్ కుమార్,భాస్కర్ రావు,మాజీ ఐఎఎస్,మొహిద్దిన్ ,గౌసీయా బేగం, తదితరులు పాల్గొన్నారు.




