దేశం

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే డీజీసీఏనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ హఠాత్పరిణామంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!