రాజకీయాలువిశాఖపట్నం
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన కొయిలాడ వెంకటేష్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యవస్థాపకులు, నటసార్వభౌముడు, దివంగత నేత శ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు కొయిలాడ వెంకటేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్.సోనా, మోహన్ రావు,మధు, పందిరిపిల్లి శ్రీను,కాళ్ళ శ్రీను,పెద్ది లావణ్య తదితరులు పాల్గొన్నారు.




