ముస్లిం తాటిచెట్ల పాలెంలో ఘనంగా హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఉర్సు ఉత్సవాలు

జీవీఎంసీ 44 వార్డ్ ముస్లిం తాటి చెట్ల పాలెంలో హజరత్ ఖాదర్ వలీ కమిటీ ఆధ్వర్యంలో రాజస్థాన్ అజ్మీర్ లో ఉన్న హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు ఫజర్ నమాజ్ అనంతరం దైవ గ్రంథం ఖురాన్ పఠనం జరిగింది. సాయంత్రం 6 గంటలకు చందనోత్సవం ఊరేగింపు అక్కయ్యపాలెం తాజ్ బాగ్ , చిన్నూరు, 80 ఫీట్ రోడ్ మీదగా తిరిగి ముస్లిం తాటి చెట్ల పాలెం చేరుకుంది. ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో ముస్లిం మహిళలు యువత పాల్గొన్నారు. అనంతరం రాత్రి 11గంటలకు ఫాతెహా దరూద్, జెండా ఆవిష్కరణ (ప్రత్యేక ప్రార్థనలు) జరిగాయి. శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు మగ్రిబ్ నమాజ్ అనంతరం ప్రముఖ ఇస్లామిక్ గాయకులు సయ్యద్ సిరాజ్ ఖాద్రి వారి ఇస్లామిక్ గేయాలతో ఆధ్యాత్మిక ప్రసంగ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం చతిస్గడ్ నుంచి విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు హజరత్ అల్లామా మౌలానా మహమ్మద్ సలీం రజా తహసీని వారి ఆధ్యాత్మిక ప్రసంగం జరిగింది. ఈ ప్రసంగంలో వారు హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి జీవిత చరిత్ర, ఆయన పరుల పట్ల చూపిన ప్రేమ, మతాలకు అతతంగా ఆయన ఆయన చూపిన ప్రేమ ఇతర అంశాలను క్లుప్తంగా వివరించారు. ప్రపంచ శాంతి కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ నలుమూలల నుండి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




