రాష్ట్రం

సిఐటియు అఖిలభారత జనవరి 4 బహిరంగ సభను జయప్రదం చేయండి సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి పిలుపు

సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి పిలుపు పరవాడ. సిఐటియు అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని జనవరి 4న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. పరవాడ మండలంలో ఫార్మసిటీలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగాసిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి మాట్లాడుతూ సిఐటియు 18వ అఖిలభారత మహాసభలు జయప్రదం చేయండి. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు సిఐటియు అఖిలభారత మహాసభలు విశాఖపట్నం వేదిక కానున్నాయని సిఐటియు ఆవిర్భవించి 55 సంవత్సరాల కాలంలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మహాసభలకు వేదిక కానున్నదని. ఈ మహాసభలకు 2000 మంది ప్రతినిధులు అన్ని రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి హాజరవుతారని. ఈ మహాసభల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా చర్చించి భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం అవుతారని. కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, బయటికి మేడిపండులా ఉన్న ఈ చట్టం లోపల కార్పొరేట్ కంపెనీలకి అనుకూలమైన విధానాల్ని అమలు చేస్తున్నారని. ఇప్పటివరకు ఉన్న హక్కుల్ని కాలరాస్తున్నారని. ఈనేపథ్యంలో జరుగు మహాసభల్లో ముగింపుగా జనవరి 4న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని, ఈ మహాసభలు జయప్రదానికి కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని గని శెట్టి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్రీ పోతి నాయుడు, కే వెంకట్రావు, కే వెంక నాయుడు, ఏ రాజు, దూల. దేవుడు, వి కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!