ఆట
ఈ నెల 28న వంగవీటి మోహనరంగా మెమోరియల్ కిక్ బాక్సింగ్ పోటీలు

ఈ నెల 28వ తేదీ (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి వంగవీటి మోహనరంగా మెమోరియల్ కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీఎంఆర్ మెమోరియల్ గ్రేటర్ విశాఖపట్నం 11వ గ్రేటర్ విశాఖ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్–2025ను రేంబో పవర్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారని తెలిపారు. అదే రోజు సాయంత్రం విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించి, ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు ఆర్గనైజర్ చీఫ్ కనకరాజు పేర్కొన్నారు.కిక్ బాక్సింగ్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
