విశాఖపట్నం

కాపులప్పాడ డంపింగ్ యార్డ్ ను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్

విశాఖపట్నం డిసెంబర్ 30:  స్వచ్ఛ సర్వేక్షన్ బృందం సర్వే నిమిత్తం మరికొద్ది రోజుల్లో వస్తున్నందున కాపులప్పాడ డంపింగ్ యార్డ్ను ఆకర్షణయంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జీవీఎంసీ పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ ను జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ లతో కలిసి పరిశీలించారు .ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ లో పరిసర ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ధి పరచాలని, అలాగే పచ్చదనంతో పాటు ప్లాంట్ ను పరిశుభ్రంగా ఉంచుతూ అవసరమైన చోట్ల సూచిక బోర్డులను స్వచ్ఛ సర్వేక్షన్ కొరకు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా బయో గ్యాస్, జిందాల్, సీ&డి వేస్ట్, లెగసీ వేస్ట్ ప్లాంటు పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సి & వేస్ట్ ప్లాంట్ ఆపరేషన్ చేసేందుకు ఔత్సాహికులను ఆహ్వానించాలన్నారు.. లెగసీ వేస్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎంత బయోమైనింగ్ చేశారని ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందని తదుపరి తీసుకోవలసిన చర్యలపై జిందాల్ అధికారులకు సూచనలు చేశారు. మిగిలిన లెగిసి వేస్ట్ ఎప్పటిలోగా పూర్తవుతుందని ఆరా తీస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ పర్యటనలో భీమిలి జోనల్ కమిషనర్ ఇప్పి నాయుడు, కార్యనిర్వాహక ఇంజనీర్ రత్నాకర్ రెడ్డి,యు ఎన్ డి పి ప్రతినిధి శ్రీనివాస్ రాజమణి, మెకానికల్ విభాగం ఉప కార్యనిర్వాహక ఇంజనీరు పి ఎస్ ఆర్ మూర్తి,ప్లాంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!